ప్రకృతి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు

- January 28, 2018 , by Maagulf
ప్రకృతి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు

చంద్రబాబు ప్రెస్ మీట్లు చాలా సుదీర్ఘంగా ఉంటాయి. ఆయన ప్రెస్ మీట్ అంటేనే చాలు మీడియా వాళ్లు భయపడిపోతుంటారు. అయితే ఒక్కోసారి చంద్రబాబు మాటలు అందరినీ కట్టిపడేస్తుంటాయి. మనసు విప్పి ఆయన మాట్లాడే మాటలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. ఆలోచింపజేస్తాయి. దావోస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ మీట్ అలాంటిదే.. !

దావోస్ నుంచి తిరిగొచ్చిన తర్వాత చంద్రబాబు సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. అనేక అంశాలపై ఓపెన్ గా మాట్లాడారు. దావోస్ పర్యటనను రాజకీయం చేయడంపై మండిపడ్డారు. అభివృద్ధికోసం తాను తపిస్తుంటే తనను విమర్శించడం సరికాదని సూచించారు. దావోస్ లో తాను పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు. వెళ్లిన రోజు స్టమక్ అప్ సెట్ అయిందన్న బాబు.. ఆ తర్వాత లూజ్ మోషన్స్ తో బాధపడ్డానన్నారు. అయినా ఒక్క మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకోలేదన్నారు. ఆ మూడ్రోజులూ పూర్తిగా పెరుగు, నీళ్లతోనే గడిపానన్నారు.

చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. తన పర్సనల్ డైట్ పైన కూడా ఇటీవల మీడియావాళ్లు అడిగితేనే ప్రస్తావించారు. సాధారణంగా ఆయన ప్రెస్ మీట్స్ అన్నీ పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినవే అయి ఉంటాయి. అయితే దావోస్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ మాత్రం అక్కడ ఆయన పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన చేసిన ప్రయత్నాన్ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంకోసం తాను ఇంత కష్టపడుతుంటే తనను విమర్శించడం సరికాదని స్పష్టంచేశారు.

చంద్రబాబు అంటే టెక్నాలజీ గుర్తొస్తుంది. అయితే ఈసారి మాత్రం ఆయన దేవుళ్లు, ప్రకృతి అంటూ మాట్లాడారు. రాష్ట్రానికి సూర్యుడే పెద్ద దిక్కు అన్నారు. అందుకే ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ సూర్యనమస్కారాలు చేయాలని కోరారు. రోజూ ఎండలో నడవడం ద్వారా రోగాలు నయమవుతాయని చెప్పారు. ప్రకృతి రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

చివరగా బీజేపీ - టీడీపీ పొత్తుపై కూడా చంద్రబాబు స్పందించారు. ఇప్పటివరకూ తాము మిత్రధర్మాన్ని పాటిస్తున్నామన్నారు. తమవాళ్లు ఎవరైనా నోరుజారితే తాను గట్టిగా మందలిస్తున్నానని చెప్పారు. ఒకవేళ బీజేపీ పొత్తు వద్దనుకుంటా నమస్కారం పెట్టి తప్పుకుంటామన్నారు. సో.. ఓవరాల్ గా చంద్రబాబు ప్రెస్ మీట్ ఈసారి ఆసక్తికర అంశాలకు వేదికైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com