నేటి నుంచి టాటా ట్రస్ట్ టెలీ వైద్య సేవలు
- January 28, 2018
గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్యం కరెన్సీనగర్ (విజయవాడ), న్యూస్‌టుడే: టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో టెలీ మెడిసిన్ సేవలను సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని ట్రస్ట్ సౌత్ హెడ్ ఆర్.పవిత్రకుమార్ తెలిపారు. విజయవాడలోని శ్రీరామచంద్రనగర్లోని ఏఎన్ఆర్ కాంప్లెక్స్‌లోని ట్రస్ట్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా విజయవాడ రూరల్ పరిధిలోని 265 గ్రామాల్లో టాటా ట్రస్ట్చే వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ ఏడాది మరింత ఆధునిక, స్పెషాలిటీ వైద్యులచే టెలీ మెడిసిన్ ద్వారా పైలెట్ ప్రాజెక్టు కింద వైద్య సేవలు అందించేందుకు ట్రస్ట్ ముందుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా 20 టెలీ మెడిసిన్ సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారుర. సోమవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు ఈ సేవలను ప్రారంభిస్తారని చెప్పారు. శ్రీరామచంద్రనగర్లోని ట్రస్టు కార్యాలయంలో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉండి ఇక్కడ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోగుల సమస్యలు తెలుసుకుని, టెలీమెడిసిన్ సెంటర్లలో సిబ్బందికి సూచనలు ఇచ్చి చికిత్స అందిస్తారని వెల్లడించారు. వ్యాధి తీవ్రత బట్టి ట్రస్టుచే అనుసంధానమైన 80 కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తామని వివరించారు. ఈ సంవత్సరం టాటా ట్రస్టుచే రోగులకు లక్ష రూపాయల బీమాను ఉచితంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.సమావేశంలో ట్రస్టు ప్రాంతీయ అధికారి రాజేంద్రబాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







