2 టెండర్లను జారీ చేసిన బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ

- January 29, 2018 , by Maagulf
2 టెండర్లను జారీ చేసిన బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ

మనామా: బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ, రెండు కొత్త టెండర్లను ఫార్మసీ మరియు కన్వీనియెన్స్‌, టొబాకో, న్యూస్‌ (సిటిఎన్‌) ప్రొవైడర్స్‌ కోసం జారీ చేసింది. కొత్త ప్యాసింజర్‌ టర్మినల్‌ భవనంలో వీటి ఏర్పాటుకు సంబంధించి టెండర్లను జారీ చేసింది బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్‌ మరియు మేనేజింగ్‌ బాడీ బహ్రెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ కంపెనీ (బిఎసి). కొత్త ప్యాసింజర్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ని 1.1 బిలియన్‌ డాలర్లతో మోడర్నైజేషన్‌లో భాగంగా నిర్మిస్తున్నారు. ఫార్మసీ టెండర్‌, ఒక ప్యాకేజీలో రెండు యూనిట్స్‌తో జారీ చేశారు. సిటిఎన్‌ టెండర్‌లో నాలుగు ప్యాకేజీలు, ఒక్కోదాంట్లో ఒక్కో యూనిట్‌ ఉంది. టెండర్లు నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ న్సెషన్స్‌తో గ్రాంట్‌ చేయబడతాయి. బిఎసి చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అయ్‌మాన్‌ జినాల్‌ మాట్లాడుతూ, ఎయిర్‌పోర్ట్‌ మోడర్నైజేషన్‌ ప్రోగ్రామ్‌, కింగ్‌డమ్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌లో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అని అన్నారు. బహ్రెయిన్‌ ప్రపంచంలోని వివిధ దేశాలకు గేట్‌ వేగా మార్చే క్రమంలో ఈ విస్తరణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com