సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌కి రెడీ అవుతున్న యూఏఈ

- January 29, 2018 , by Maagulf
సూపర్‌ బ్లూ బ్లడ్‌ మూన్‌కి రెడీ అవుతున్న యూఏఈ

సంపూర్ణ చంద్రగ్రహణం, సూపర్‌ మూన్‌ కలిసి 55 ఏళ్ళ తర్వాత యూఏఈలో కనువిందు చేయనుంది. అయితే పూర్తిస్థాయిలో చంద్రగ్రహణాన్ని కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే తిలకించే అవకాశం యూఏఈ వాసులకు ఉంది. ఎక్లిప్స్‌ నుంచి మూన్‌ బయటపడే మొత్తం ఎపిసోడ్‌ని చూసేందుకు మాత్రం సుమారు గంటసేపు అవకాశం కలగనుంది. దుబాయ్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ వెల్లడించిన వివరాల ప్రకారం సూపర్‌ మూన్‌ కారణంగా, సాధారణ చంద్రుడితో పోల్చితే మనకి 13 రెట్లు ఎక్కువ పెద్దదిగా కనిపిస్తుందని, 30 శాతం బ్రైట్‌గా ఉంటుందని తెలియవస్తోంది. దుబాయ్‌ ఆస్ట్రానమీ గ్రూప్‌ సీఈఓ హసన్‌ అల్‌ హరిరి మాట్లాడుతూ, తనకు 14 ఏళ్ళ వయసున్నప్పుడు సూపర్‌ మూన్‌ ఎక్లిప్స్‌ని చూశానని చెప్పారు. జనవరి 31న ఈ చంద్రగ్రహణం చోటు చేసుకోనుంది. పూర్తి చంద్రహణం 6.04 నిమిషాలకు కన్పించనుంది. ఆ తర్వాత 7.11 నిమిషాల వరకు అది ఉంటుంది. అంటే ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా కనిపించడు. ఆ తర్వాత క్రమంగా చంద్ర గ్రహణం వీడనుంది. 7.11 నిమిషాలకు చంద్రుడు యధాస్థితికి వచ్చేస్తాడు. ఎత్తయిన ప్రాంతాల్లోకి, విద్యుత్‌ కాంతులకు దూరంగా వెళితే గనుక చంద్రగ్రహణాన్ని ఇంకా బాగా తిలకించేందుకు వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com