భారత్‌కి సలామ్ ఎయిర్ విమానాలు!
- January 29, 2018
మస్కట్: ఒమన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్, ఇండియాకి విమాన సర్వీసుల్ని ప్రారంభించనుంది. ఇండియా, తమకు సక్సెస్ఫుల్ రూట్‌గా మారుతుందని సలామ్ ఎయిర్ సీఈఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఇండియాకి విమానాలు నడిపేందుకుగాను సంబంధిత అధికార వర్గాల నుంచి క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు. ఇండియాలో ఎక్కడికి విమానాలు నడిపినా, అది తమకు లాభదాయకంగానే ఉంటుందని చెప్పారాయన. ఇండియా - ఒమన్ మధ్య 2016లో కుదిరిన ఒప్పందం ప్రకారం, వారానికి 27,405 సీట్లకు (ఇరువైపులా) అనుమతి లభించింది. గతంలో ఈ సంఖ్య 21,145గా ఉండేది. తమ వెబ్సైట్ ద్వారా ట్రావెల్ ప్యాకేజీలను వెల్లడించనున్నట్లు కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ చెప్పారు. ఈ సమ్మర్లో బాకు (అజర్బైజాన్), త్బిలిసి (జార్జియా)లకు విమానాలు ప్రత్యేకంగా నడిపే యోచన చేస్తున్నట్లు వెల్లడించారాయన. ఉమ్రా ప్యాకేజీలను సైతం సలామ్ ఎయిర్ ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







