దటీజ్‌ కోవింద్‌! ఫ్యామిలీని సైతం పక్కనపెట్టారు..

- January 29, 2018 , by Maagulf
దటీజ్‌ కోవింద్‌! ఫ్యామిలీని సైతం పక్కనపెట్టారు..

న్యూఢిల్లీ : ప్రముఖులకు పరిచయస్తులు కావడమే అదేదో అర్హత అయినట్లు వెళ్లినచోటల్లా హడావిడిచేస్తుంటారు కొందరు. ఇక ఆ ప్రముఖుడి కుటుంబసభ్యులైతేనా.. పొందే వీఐపీ ట్రీట్మెంట్లు, చేసే రచ్చ ఏమాత్రం తక్కువ ఉండదు. అయితే అందరు ప్రముఖులూ అలా ఉండరు. అప్పనంగా ప్రత్యేక సేవలు చేయించుకోరు, కొన్నిసార్లు ప్రోటోకాల్‌ హక్కుల్ని సైతం వదిలేసుకుని హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకి మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మొన్న రిపబ్లిక్‌డేనాడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.

జాతీయ పండుగ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఎట్‌ హోమ్‌ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబసభ్యులను ఆహ్వానించలేదు. భార్య సవితను మాత్రమే కోవింద్‌ తనతో తీసుకెళ్లారు. ఎట్‌ హోమ్‌ అంటే ఏదో రాజకీయ వందనాలు, మొహమాటపు పలకరింపులు, అక్కరలేని ఆహ్వానితులతో జరగకూడదని రాష్ట్రపతి భావించారట. కార్యక్రమ ప్రాంగణం.. స్ఫూర్తిదాయక సమ్మేళనంలా, చక్కటి సృహృద్భావ వాతావరణంలో, ప్రేరణను ఇచ్చే, ప్రేరణ పొందే వ్యక్తులతో కళకళలాడాలని కోరుకున్నారట. ఈ క్రమంలోనే తన కుటుంబీకులను కూడా ఆహ్వానించవద్దని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com