ఒక మనిషికి ఒకే బ్యాంకు అకౌంట్
- January 29, 2018
ఒక వ్యక్తికి ఒకే అకౌంట్
హైదరాబాద్‌ఫ ఒక వ్యక్తికి ఒకే బ్యాంక్ అకౌంట్ ఉండేలా చర్యలు తీసుకు నేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సన్నాహాలు చేస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకూ మొబైల్ నెంబర్లకు మాత్రమే ఉన్న పోర్ట బులిటీ వ్యవస్థను బ్యాంకులకు కూడా తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆర్బీఐ అధి కారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వినియోగదార్లకు మెరుగైన, వేగవంతమైన సేవలందించడంతో పాటు, చట్ట విరుద్ధమైన లావాదేవీలకు చెక్ పెట్టేందుకు పోర్టబిలిటీ సేవలను తేవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం చురుకుగా సాగుతోంది. ఆధార్‌తో అనుసంధానం పూర్తి అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది తేలనుంది. ఆధార్‌తో అనుసంధానం పూర్తయిన తరువాత ముందుగా సేవింగ్ అకౌంట్ పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. అకౌంట్ పోర్టబిలిటీ అనేది బ్యాం కులకు సవాలే అయినా దీన్ని తప్పనిసరిగా అమ లుకు ఆర్బీఐ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







