నారా రోహిత్ న్యూ మూవీ
- January 29, 2018
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న నారా రోహిత్ తాజాగా ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ సంస్థ నిర్మించబోయే చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ప్రొడక్షన్ నెం.3గా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ఎస్.డి.చక్రవర్తి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైవిధ్యమైన కథతో విలేజ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి మొదలుకానుంది. వడ్డేపల్లి సత్యనారాయణ సమర్పణలో తెరకెక్కే ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర చిత్రణ, గెటప్ చాలా టిఫికల్‌గా ఉంటాయని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం తమ సంస్థ నిర్మించిన హౌరాబ్రిడ్జ్ చిత్రం విడుదలలో బిజీగా ఉండటం వల్ల నారా రోహిత్ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఆ బృందం తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతాన్ని సాయికార్తీక్ సమకూర్చనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







