అన్ని రౌండ్లలోనూ దయాకర్‌ ఆధిక్యం ..

- November 24, 2015 , by Maagulf
అన్ని రౌండ్లలోనూ దయాకర్‌ ఆధిక్యం ..

వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌యార్డులో వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తెరాస అభ్యర్ధి పసునూరి దయాకర్‌ ప్రత్యర్థులకు అందనంత భారీ అధిక్యంలో దూసుకుపోతున్నారు. 13 వ రౌండ్‌ పూర్తయ్యే సరికి దయాకర్‌ 3,31,089 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 13వ రౌండ్‌ పూర్తయ్యే సరికి తెరాస అభ్యర్థికి 4,43, 915, కాంగ్రెస్‌ అభ్యర్థికి 1,12,8229, భాజపాకు 89,828 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. తొలి నుంచి అన్ని రౌండ్లలోనూ దయాకర్‌ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది. వరంగల్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ కరుణ, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పర్యవేక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com