'జిల్' సినిమా జోడీ మరోసారి....
- November 24, 2015
'జిల్' సినిమా కమర్సియల్ గా పెద్దగా వర్కౌట్ కాకపోయినా...గోపీచంద్, రాశి ఖన్నా మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. త్వరలో ఈ ఇద్దరూ మరోసారి కలిసి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో తరుణ్‌తో 'నీ మనసు నాకు తెలుసు' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. మూడేళ్ల క్రితం వచ్చిన 'ఊ లలలా' తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలో సినిమాలేవీ రాలేదు. అయితే రీసెంట్గా ఓ స్టోరీని గోపీచంద్‌కు వినిపించి ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జిల్ సినిమాలో గోపీచంద్, రాశి ఖన్నా జోడీ బాగా కుదరడంతో వారితోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం గోపీచంద్ చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత 2016లో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం రాశి ఖన్నా సాయి ధరమ్ తేజ్ కు జోడీగా 'సుప్రీమ్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు ఆమె నటించిన 'బెంగాల్ టైగర్' మూవీ విడుదలకు సిద్దమవుతోంది. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి రూపొందిస్తున్న సౌఖ్యం సినిమా క్రిస్మస్ కానుకగా ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మధ్య కాలంలో హిట్లకు దూరమైన గోపీచంద్ ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







