అమెరికాలో ఇండియన్ ఇన్నోవేటర్లకు అరుదైన పురస్కారం
- January 30, 2018
వాషింగ్టన్‌ః అమెరికాలో ఇద్దరు భారత సంతతి ఇన్నోవేటర్లకు అరుదైన గౌరవం దక్కింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ఇద్దరు ఇన్నోవేటర్లు స్థానం సంపాదించారు. మిమో(మల్టిపుల్ ఇన్‌పుట్.. మల్టిపుల్ ఔట్‌పుట్) వైర్‌లెస్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఆరోగ్యస్వామి పాల్‌రాజ్, నానోకాంపోజిట్ డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్స్‌ను సృష్టించిన సుమితా మిత్రా ఈ అరుదైన గౌరవం పొందారు. ఈ ఏడాది మే 2, 3 తేదీల్లో జరిగే ద గ్రేటెస్ట్ సెలబ్రేషన్ ఆఫ్ అమెరికన్ ఇన్నోవేషన్‌లో ఈ ఇద్దరినీ సన్మానించనున్నారు. ఈ ఏడాది ఈ ఇద్దరితోపాటు మరో 13 మంది ఇన్నోవేటర్లకు ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది. పాల్‌రాజ్ కనిపెట్టిన వైర్‌లెస్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ ఇంటర్నెట్ యాక్సెస్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ కొనియాడింది. మిమో (మల్టిపుల్ ఇన్‌పుట్.. మల్టిపుల్ ఔట్‌పుట్) వల్ల డేటా ట్రాన్స్‌మిషన్ రేట్ పెరగడంతోపాటు నెట్‌వర్క్ కవరేజ్ కూడా మెరుగుపడుతుందని తెలిపింది. ఈ అరుదైన గౌరవం దక్కడం తనకు చాలా ఆనందంగా ఉన్నదని పాల్‌రాజ్ అన్నారు. అటు ఫిల్‌టెక్ సుప్రీం రీస్టోరేటివ్ అనే నానోకంపోజిట్ డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్ కనిపెట్టినందుకుగాను 69 ఏళ్ల సుమితా మిత్రాకు కూడా ఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కింది.
సుమితా 1990 దశకం చివర్లోనే నానోపార్టికల్స్‌తో కూడిన తొలి డెంటల్ ఫిల్లింగ్ మెటీరియల్‌ను కనిపెట్టారు. తాజాగా నోట్లో ఎక్కడైనా పళ్లను పునరుద్ధరించే అరుదైన లక్షణంతో కూడిన కంపోజిట్ ఫిల్లింగ్ మెటీరియల్‌ను సుమితా తాజాగా డెవలప్ చేశారు. ఈ ఆవిష్కరణకుగాను ఆమెను నేషనల్ ఇన్వెంటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చారు.
తాజా వార్తలు
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్‌షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!
- ఫుజైరాలో భారతీయ ప్రవాసుడు అనుమానస్పద మృతి..!!
- కువైట్‌లో 1.059 మిలియన్లకు పెరిగిన భారతీయ జనాభా..!!
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ గ్రాండ్ రిసెప్షన్ సక్సెస్..!!
- సిత్రాలో ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి సిఫార్సు..!!
- తన రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన యువీ
- యాదగిరిగుట్ట ఆలయంలో వెండి, బంగారం డాలర్లు మాయం..
- వింగ్స్ ఇండియా 2026 సందర్భంగా నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశాలు







