మలేషియాలో వెలుస్తున్న తెలుగు అకాడమీ
- January 30, 2018
హైదరాబాద్: మలేషియాలో తెలుగు వారికోసం అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అకాడమీ కోసం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఆ దేశంలో ఉన్న తెలుగు సంఘం.. కౌలాలంపూర్‌లో ఈ అకాడమీని ఏర్పాటు చేస్తోంది. ఇది సమీప దేశాల్లో ఉన్న తెలుగువారి కోసం ఉపయోగపడుతుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఈ అకాడమీని నిర్మిస్తున్నది. కౌలాలంపూర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవాంగ్ సెలంగర్ ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాల స్థలంలో అకాడమీని నిర్మిస్తున్నారు. తెలుగు భాషతో పాటు డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ఇతర కళలను కూడా అక్కడ నేర్చుకునే వీలుందని టామ్ ప్రెసిడెంట్ వై.అచ్చయ్య కుమార్ రావు తెలిపారు. మలేషియాలో తెలుగు నేర్చుకుంటున్న సుమారు మూడు వేల మందికి ఈ అకాడమీ వల్ల లాభం చేకూరే అవకాశాలున్నాయి. పొట్టి శ్రీరాములు వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తయారు చేయనున్నారు. అకాడమీ నిర్మాణం కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు. మార్చి 2016లో దీని కోసం శంకుస్థాపన జరిగింది. అయితే మలేషియా ప్రభుత్వం తెలుగు అకాడమీ కోసం 25 కోట్లు కేటాయించింది.
తెలుగు రాష్ర్టాల సీఎంలను త్వరలో మలేషియాకు ఆహ్వానించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







