ప్రపంచ సుందరి కలలకు తొలి అడుగులు
- January 30, 2018
18న ఎఫ్‌బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ఈనాడు డిజిటల్, బెంగళూరు: భారతదేశానికి 17ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తెచ్చిన మానుషి చిల్లర్లా వెలగాలని ఆశించే యువతులు ఎందరో... వారి కలలను సాకారం చేసేందుకు తొలిమెట్టుగా భావించే ఎఫ్‌బీబీ ఫెమినా మిస్ ఇండియా ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 9నుంచి ప్రారంభమయ్యే ఈ ఎంపిక ప్రక్రియను బెంగళూరులో ఈనెల 18న నిర్వహిస్తారు. ప్రపంచ సుందరి నీలి కిరీటాన్ని మళ్లీ భారత్ ముంగిట ఉంచాలనుకునే వారికి నేహా ధూపియా, పూజా చోప్రా, పూజా హెగ్డే, రకుల్ ప్రీత్‌సింగ్ వంటి వారు శిక్షణ ఇవ్వనున్నారు. దిల్లీతో సహా దేశ వ్యాప్తంగా 30రాష్ట్రాల్లో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో అర్హత పొందిన వారు భారతదేశం తరపున ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటారు. మొత్తం రాష్ట్రాల నుంచి ఎంపికైన వారికి బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, ముంబయి వంటి వలయ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. బెంగళూరులో 18, 24తేదీల్లో దక్షిణ వలయ స్థాయి ఎంపిక జరుగుతుంది. అనంతరం వివిధ వలయాల్లో గెలుపొందిన వారికి మే 13న ముంబయిలో అంతిమ పోటీలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు