ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ మీటింగ్

- January 31, 2018 , by Maagulf
ఫేస్‌బుక్‌ ప్రతినిధులతో మంత్రి లోకేష్‌ మీటింగ్

సాన్‌ ఫ్రాన్సిస్కో : ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ బుధవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆధునాతన టెక్నాలజీల గురించి మంత్రి లోకేష్‌ ఫేస్‌బుక్‌ సిబ్బందికి వివరించారు. అనంతరం ఫేస్‌బుక్‌ స్పేసెస్‌, వర్చ్యువల్‌, రియాల్టీ కాన్సెప్ట్స్‌పై లోకేష్‌ ఫేస్‌బుక్‌ సిబ్బంది వివరించారు. అనంతరం క్యాడెన్స్‌ కంపెనీ సిఇఒ లిప్‌ భూట్యాన్‌ అధ్యక్షులు అనిరుధ్‌తో భేటీ అయ్యారు. గూగుల్‌ డేటా సెంటర్‌ బృంద సభ్యులు డిస్టింగిషీడ్‌ ఇంజినీర్‌ పార్థసారథి, రామ్‌, యాస్పీతోనూ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన సమయానికి ఇంటర్నెట్‌ సేవలు పెద్దగా విస్తరించలేదని చెప్పారు. డేటా వినియోగం పెరిగితే స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ఫైబర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేసాం.149 రూపాయిలకే ఇంటర్నెట్‌, వైఫై, టెలివిజన్‌ అందిస్తున్నామన్నారు. గూగుల్‌ హెల్త్‌ కేర్‌, వ్యవసాయ రంగంలో అనలిటిక్స్‌,మెషీన్‌ లెర్నింగ్‌ సేవల్లో గూగుల్‌ సహకారం కావాలని కోరారు. గూగుల్‌ క్లౌడ్‌ మినీ క్లస్టర్లు ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌ను పరిశీలించాలని కోరారు.

ఇందుకు స్పందించిన గూగుల్‌ ప్రతినిధుల బృందం త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక బృందాన్ని పంపించి వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై అధ్యయనం చేస్తామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com