మవసలాత్‌ ట్యాక్సీ ధరల తగ్గింపు

- January 31, 2018 , by Maagulf
మవసలాత్‌ ట్యాక్సీ ధరల తగ్గింపు

మస్కట్‌: ఒమన్‌ నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీ (మవసలత్‌), కొత్త ట్యాక్సీ ధరల్ని ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. మవసలాత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, 1 ఒమన్‌ రియాల్‌తో మీటర్‌ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇది పగటిపూట ధర. రాత్రి వేళల్లో ఈ ధర 1.3గా ఉంటుంది. ప్రతి కిలోమీటర్‌కి 200 బైజా అదనంగా తొలి 30 కిలోమీటర్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. పగలు, మరియు రాత్రి బుకింగ్‌ ఫీజు 500 బైజాస్‌గా నిర్ణయించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాక్సీలు మాల్స్‌ వద్ద అందుబాటులో ఉంటాయి. ప్రమోషనల్‌ పీరియడ్‌లో భాగంగా ట్యాక్సీ ఫేర్స్‌ జనవరి 31 వరకు, 1.2 ఒమన్‌ రియాల్స్‌తో రుసుములు ప్రారంభమవుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com