అల్ అరీన్ ప్యాలెస్ మరియు స్పా: స్థానిక, అంతర్జాతీయ అవార్డులు
- January 31, 2018
మనామా: అల్ అరీన్ ప్యాలెస్ మరియు స్పా, ప్రముఖ అవార్డింగ్ సంస్థల నుంచి ఫుడ్, అకామడేషన్ మరియు స్పా విభాగాల్లో నాలుగు ప్రతిష్టాత్మక అవార్డుల్ని అందుకున్నట్లు వెల్లడించింది. సాఫ్రాన్ రెస్టారెంట్‌కి ఫేవరెట్ గల్ఫ్ రెస్టారెంట్ అవార్డ్ దక్కించుకుంది. సిటీ ఫ్యాక్ట్ డైనింగ్ అవార్డ్స్ 2017 వేదికపై ఈ అవార్డ్‌ని అందుకుంది ఈ సంస్థ. వరల్డ్ లగ్జరీ హోటల్ అవార్డ్స్ కేటగిరీలో లగ్జరీ స్పా హోటల్ మరియు లగ్జరీ విల్లా రిసార్ట్‌గా అవార్డ్ దక్కించుకుంది. లగ్జరీ ప్రైవేట్ పూల్ విల్లా కేటగిరీలో గ్లోబల్ విన్నర్‌గానూ నిలిచింది. అల్ అరీన్ ప్యాలెస్ మరియు స్పా అందుకున్న ప్రతిష్టాత్మక పురస్కారాలు చాలా ఆనందాన్నిచ్చాయని అల్ అరీన్ ఇన్వెస్టిమెంట్ కంపెనీ సీఈఓ డాక్టర్ ఎస్సా ఫఖీ చెప్పారు. బహ్రెయిన్‌లో తొలి లగ్జరీ రిసార్ట్‌గా విల్లా స్టైల్లో అల్ అరీన్ ప్యాలెస్ మరియు స్పా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది. 78 లగ్జరీ విల్లాస్, అతి పెద్ద స్పా మరియు వెల్ నెస్ ఏరియా, మూడు సిగ్నేచర్ రెస్టారెంట్లు, హెల్త్ మరియు ఫిట్నెస్ సెంటర్, టెన్నిస్ మరియు స్క్వాష్ కోర్టులు, మీటింగ్ మరియు బ్లాంకెటింగ్ ఫెసిలిటీస్ వంటివి ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







