ఒమన్‌లో ఇండియన్లకు చెక్ పెడుతున్న ప్రభుత్వం
- January 31, 2018
హైదరాబాద్: గల్ఫ్ దేశాల్లో ఇక ఉద్యోగాలు చేయాలనుకొనే వారి ఆశలపై ఒమన్ ప్రభుత్వం చిక్కులు కల్పించింది. సుమారు 87 రంగాల్లో పలు ఉద్యోగాల నియామకాల్లో స్థానికులకే అవకాశాలు కల్పించాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాల్లో పనిచేసేందుకు వెళ్ళే వారికి నిరాశను మిగిల్చింది.
ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, మార్కెటింగ్ తదితర రంగాల్లోని 87 రకాల ఉద్యోగాలకు వీసాలను ఒమన్ ప్రభుత్వం నిలిపివేసింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం కొనసాగించనున్నట్టు ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది.
ఉపాధి కోసం ఇతర దేశాల నుండి వలసవచ్చినవారు పోటీ పడడం స్థానికులకు ఉద్యోగావకాశాలు తగ్గిపోవడం వంటి పరిణామాలతో మస్కట్(ఒమన్)ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.
గల్ప్ దేశాల్లో 20 లక్షల మంది భారతీయులు ఉన్నారని ఓ అంచనా. అయితే ఇందులో తెలుగు రాష్ట్రాల నుండి కూడ ఉపాధి కోసం వెళ్ళే వారి సంఖ్య గణనీయంగానే ఉంది.తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 4.75 లక్షల మంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారని అంచనాలు వెల్లడిస్తున్నాయి భవన నిర్మాణ రంగంలో, కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులుగా గల్ప్ దేశాల్లో పనిచేస్తుంటారు ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు వలసలు పెరగడంతో స్థానికుల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని అక్కడి ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో 87 రంగాల్లో ఉద్యోగావకాశాలను స్థానికులకే ఇవ్వాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కీలకమైన రంగాల్లో కూడ విదేశాల నుండి వచ్చినవారే ఉద్యోగాలు చేస్తుండడంతో స్థానికులు ఉద్యోగాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ కారణంగా విదేశాల నుండి వలస వచ్చినవారికి ఉద్యోగావకాశాలపై తాత్కాలికంగా ఆశలు వదులుకోవాల్సిందే.
గతంలో కంటే భిన్నంగా గల్ఫ్ దేశాలు నిర్ణయాలు తీసుకొంటున్నాయి. స్థానికంగా చోటు చేసుకొన్న పరిస్థితుల కారణంగా అక్కడి ప్రభుత్వాలు నిర్ణయాలను మార్చుకొంటున్నాయి. ఉద్యోగావకాశాల్లో స్థానికులకే పెద్దపీట వేయాలని నిర్ణయానికి వచ్చాయి. వలస వెళ్ళినవారికి తక్కువగా ఉపాధి అవకాశాలను కల్పించేలా అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకొంటున్నాయి. ఏదైనా సంస్థలో స్థానికుల సంఖ్య ఎక్కువగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి