మరో నిర్మాత తనయుడు హీరోగా 'ఒక్కటే లైఫ్' సినిమా
- February 01, 2018
లార్డ్ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై నారాయణ్ రామ్ నిర్మిస్తొన్న చిత్రం" ఒకటే లైఫ్" .హ్యాండిల్ విత్ కేర్ అనేది ఉప శీర్షిక. ఎం.వెంకట్ దర్శకుడు. శృతి యుగల్ హీరొయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో సుమన్ ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. టైటిల్ చూడగానె సినిమా కాన్సెప్ట్ ఎంటనేది అందరికీ అర్దమవుతుంది. టెక్నాలజీ పేరుతో పరుగులెడుతోన్న నేటి తరం హ్యూమన్ రిలెషన్స్ కు ఎమోషన్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సినిమాలోని ప్రతి పాత్రకు ఓ పర్పస్ ఉంటుంది. సూపర్ గుడ్ అధినేత ఆర్.బి.చౌదరి గారబ్బాయి జితన్ రమేష్ హీరోగా నటిస్తున్నారు. మంచి సినిమా చూశామన్న సంతృప్తి ప్రేక్షకులకు మా సినిమా కలిగిస్తుందన్నారు.
నిర్మాత నారయణ్ రామ్ మాట్లాడుతూ.. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మా టీమ్ అందరికీ మంచి పేరును తీసుకువచ్చె చిత్రంగా నిలుస్తుంది. అతి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







