జహ్రాలో ఒకరినొకరు తన్నుకున్న కార్ల తనిఖీ ఇన్ స్పెక్టర్లు
- February 01, 2018
కువైట్: పదిమందికి బుద్ధులు చెప్పాల్సిన వాహన తనిఖీ అధికారులు వానరులుగా మారి కీచులాడుకొని ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఈ ఘటన జాహ్రా వాహనం సాంకేతిక తనిఖీ విభాగంలో బుధవారం జరిగింది. ఆ ఇన్ స్పెక్టర్లు ఉద్యోగాలు సంబంధించిన వివాదాలు కారణంగా మాత్రం వీరు తన్నుకోలేదుగానీ ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్నారు.. గోళ్ళతో రక్కుకొన్నారు...పెన్నులతో పొడుచుకొన్నారు..ఒక్కమాటలో చెప్పాలంటే వారు పనిచేస్తున్న కార్యాలయం వీరికి పోరాట వేదికగా మార్చేశారు . ఈ ముగ్గురిలో ఒకరు మాధకద్రవ్యాల ప్రభావంతో వింతగా ప్రవర్తించి తగాదా పడినట్లు అపరాధపరిశోధకులు వాకబు చేశారు, మరొక ఇన్ స్పెక్టర్లు ఇంటికి వెళ్లి గుర్తింపు కార్డుని తీసుకువస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు ఆయన ఆ విధంగా అదృశ్యమైతే, మిగిలిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. వాదన తీవ్రమై ఒకరిపై ఒకరు దాడులు చేసుకొన్నారు. వారిలో ఒకరు సహచర ఉద్యోగిని పెన్నుతో పొడిచి గాయపరిచాడు. గాయపడిన ఇన్స్పెక్టర్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై బాధితుడు సాద్ అల్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేశాడు. వీరి తగాదాపై డిటెక్టివ్ లు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







