'తొలిప్రేమ' ట్రైలర్ రిలీజ్
- February 01, 2018
'తొలిప్రేమ' ట్రైలర్ విడుదల
హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'తొలిప్రేమ'. రాశీ ఖన్నా కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌లో వరుణ్ తేజ్..'జ్ఞాపకాలు.. చెడ్డవైనా, మంచివైనా ఎప్పుడూ మనతోనే ఉంటాయి. మోయక తప్పదు' అంటున్న డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ట్రైన్‌లో రాశీఖన్నాను చూసిన వరుణ్‌తేజ్..వెంటనే రైలెక్కి ఆమెను వాటేసుకోవడం..'ఇంత అందంగా ఉన్నావేంటి' అని ప్రశంసిస్తే రాశీ వరుణ్ చెంప ఛెళ్లుమనిపించడం ఫన్నీగా ఉంది. 'కలగా నా జీవితంలోకి వచ్చావ్. కలగంటున్నప్పుడు వెళ్లిపోయావ్.. మళ్లీ ఇలా మెరిశావ్. కలో నిజమో అర్థం కావడంలేదు' అన్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
ఇందులో ప్రియదర్శి వరుణ్ స్నేహితుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రియదర్శిని చూసి రాశీ 'నైస్ టు మీట్ యూ అన్నయ్య' అనడం ఇందుకు వరుణ్ తేజ్..'నువ్వు మాత్రం నాకు ఐలవ్యూ చెప్పవు కదా' అన్న డైలాగులు అలరించేలా ఉన్నాయి. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఫిబ్రవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!
- ఇస్రో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్
- సుప్రీంకోర్టులో తెలంగాణ గవర్నమెంట్ కి ఎదురుదెబ్బ