బాలకృష్ణ రైట్ షోల్డర్ ట్రీట్మెంట్

- February 03, 2018 , by Maagulf
బాలకృష్ణ రైట్ షోల్డర్ ట్రీట్మెంట్

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రీకరణ సమయంలో గాయంరాయదుర్గం,న్యూస్‌టుడే: సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ కుడి భుజానికి శనివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ కాంటినెంటల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పట్లో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అప్పట్నుంచి భుజం నొప్పి సమస్యతో (రొటేటర్‌ కప్‌ టియర్స్‌ ఆఫ్‌ షోల్డర్‌) బాధపడుతున్నారు. జైసింహా సినిమా చిత్రీకరణలో తీరిక లేకుండా ఉన్న ఆయన జనవరిలో వైద్యులను సంప్రదించారు. మందులతో నొప్పి తగ్గకపోవడంతో శనివారం ఉదయం బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్‌ సర్జన్‌ దీప్తి నందన్‌రెడ్డి, ఆశిష్‌ బాబుల్కర్‌(పుణే) ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. 'చికిత్స విజయవంతమైందని, మూడు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉంటారని' వైద్యులు వెల్లడించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com