బెంగళూరులో మోడీ పర్యటన షెడ్యూల్ డీటెయిల్స్
- February 03, 2018
ప్రధాని నరేంద్ర మోడీ నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఎన్నికలు జరగనున్న కర్ణాటక అంతటా భారతీయ జనతా పార్టీ 90 రోజుల పాటు నిర్వహించిన నవనిర్మాణ పరివర్తన యాత్ర ముగింపు ర్యాలీలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం బెంగళూరు చేరుకోనున్న మోడీ.. సాయంత్రం పాలస్ గ్రౌండ్లో జరిగే ర్యాలీలో ప్రసంగిస్తారు.
నవంబర్ 1న బీజేపీ జాతీయ అధ్యక్షుడు బెంగళూరులో ప్రారంభించిన నవనిర్మాణ పరివర్తన యాత్ర ఇవాళ్టితో ముగుస్తుంది. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి 28న ప్రధాని బెంగళూరులో జరిగే ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సింది. కానీ జనవరి 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడం, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో మోడీ యాత్ర చివరి రోజు ర్యాలీలో పాల్గొంటున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్, లేదా మే లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మొత్తం 224 నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నవనిర్మాణ పరివర్తన యాత్ర నిర్వహిస్తోంది. కర్ణాటకలోబీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కూడా స్టార్ట్ చేసింది. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ ఇతర సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించింది.
ప్రధాని బెంగళూరు పర్యటనతో రాష్ట్ర బీజేపీ నాయకులు భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని వేలాది మంది సభకు హాజరయ్యేందుకు వీలుగా పాలస్ గ్రౌండ్ సిద్ధం చేశారు. నగరం మధ్యలో ఉండే ఈ మైదానానికి లక్ష మంది వరకూ బీజేపీ కార్యకర్తలు, నేతలు హాజరవుతారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు