మంచు హీరో కోసం బాహుబలి రచయిత సీనియర్ కేవీ విజయేంద్ర ప్రసాద్
- February 03, 2018
సినిమా : సీనియర్ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ అందించే కథలు చాలా వరకు బ్లాక్ బస్టర్లు అవుతాయనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. ముఖ్యంగా బాహుబలి, భజిరంగీ భాయ్‌జాన్‌లతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అందుకే భాషలకతీతంగా దర్శకులు ఆయన కథ కోసం ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో మరో యువ హీరో కోసం ఆయన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
‘‘మంచు విష్ణు కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సోషల్ డ్రామాగా అది ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో స్క్రిప్టును పక్కాగా హ్యాండిల్ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడి కోసం విష్ణు వేటను ప్రారంభించేశాడు. ఇప్పటికే ఇద్దరు యంగ్ డైరెక్టర్లను పేర్లను విష్ణు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది’’ అన్నది ఆ కథనం సారాంశం.
అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే చిత్రం సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు విష్ణు నటించిన రెండు చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, గాయత్రి విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







