ట్రిపుల్ ధమాకా తో అక్కినేని వారి కోడలు సమంత
- February 03, 2018
అక్కినేని వారి కోడలు సమంత ఈసారి ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతుంది. సమంత నటించిన మూడు సినిమాలు.. ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలకు ముస్తాబవుతున్నాయి.
విశాల్-సమంత హీరో హీరోయిన్స్‌గా తమిళంలో రూపొందిన 'ఇరుంబు తిరై' తెలుగులో 'అభిమన్యుడు'గా అనువాదమయ్యింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా అలరించబోతున్నాడు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా సంక్రాంత్రికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ప్రకటించాడు ప్రొడ్యూసర్ కమ్ హీరో విశాల్. ఈ చిత్రాన్ని మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
మార్చి 29నే సమంత నటిస్తోన్న సావిత్రి బయోపిక్ 'మహానటి' కూడా విడుదల కానుంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో మొదటిసారి సామ్ నటిస్తోన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ 'రంగస్థలం-1985' మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సమంత నటిస్తోన్న మూడు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో ఆడియెన్స్‌ను అలరించబోతున్నాయన్నమాట. మరి ఈ మూడు చిత్రాలతో అక్కినేని వారి కోడలు ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు







