ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఇందిరా పాత్ర కోసం న‌దియా?

- February 03, 2018 , by Maagulf
ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఇందిరా పాత్ర కోసం న‌దియా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నదియా?

హైదరాబాద్‌: విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా ప్రఖ్యాతి చెందిన నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్‌' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం కోసం సీనియర్‌ నటి నదియాను దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పాత్ర కోసం ఆమెను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నదియా అయితే ఆ పాత్రకు పూర్తి న్యాయం చేయగలరని టీం భావించిందట. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ బయోపిక్‌ ద్వారా ఎన్టీఆర్‌ జీవితంలోని ప్రధాన ఘట్టాల్ని మాత్రమే చూపించాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినిమాలోని పలు పాత్రల కోసం టీం పలువురు నటీనటులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్ని బాలయ్య నిర్వర్తిస్తున్నారు.

ఈ ఏడాది చివర్లో సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జనవరి 18న చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

మరోపక్క ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' టైటిల్‌తో సినిమా తీస్తున్నారు. ఇది ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి దృష్టి కోణంలో ఉంటుందని వర్మ అన్నారు.

ఇంకా ఈ సినిమాలో నటీనటుల వివరాలను ఆయన వెల్లడించలేదు. గత ఏడాదే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com