వెంకటేష్, తేజ కంబినేషన్లో మూవీ
- February 04, 2018
సీనియర్ హీరో వెంకటేష్ గత ఏడాది గురు సినిమాలో నటించారు. ఆ తర్వాత కొత్త చిత్రమేదీ అంగీకరించలేదు. అనేక కథలు విన్నప్పటికీ ఫైనలైజ్ చేయలేదు. కొత్తదనం ఉన్న కథలు కావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రీమేక్‌లపై కూడా దృష్టి పెట్టారు. కానీ ఏదీ కూడా కొలిక్కిరాలేదు. ఈ లోపు దర్శకుడు తేజ చెప్పిన కథ నచ్చింది. వెంటనే డేట్స్ ఇచ్చేశారు. నేనే రాజు - నేనే మంత్రి సినిమా సక్సెస్‌తో తేజపై నమ్మకం పెరిగింది. వైవిథ్యమైన కథాశంతో తేజ చెప్పిన కథకి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఇదేనెలాఖరున షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వెంకటేష్‌తో పాటుగా నారా రోహిత్ మరో ముఖ్యపాత్రని పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్లు ఎవరనే దానిపై ఇంకా స్పష్టతరాలేదు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







