అభిమాని మరణంతో.. లారెన్స్ షాకింగ్ డెసిషన్

- February 04, 2018 , by Maagulf
అభిమాని మరణంతో.. లారెన్స్ షాకింగ్ డెసిషన్

తన అభిమాని అయిన శేఖర్ మరణంతో రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఇలాంటి నిర్ణయం సినీ ఇండస్ట్రీలో ఏ ప్రముఖుడూ తీసుకొని ఉండరు. అసలు విషయం ఏంటంటే.. ఆర్.శేఖర్ అనే లారెన్స్‌ అభిమాని ఆయనతో పిక్ తీసుకునేందుకు వెళ్లి చనిపోయాడు. ఇది లారెన్స్‌ను చాలా బాధించింది. దీంతో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనకు టైమ్ దొరికినప్పుడల్లా అభిమానుల దగ్గరకు తానే వెళ్లి పిక్స్ తీసుకుని వస్తానని.. అభిమానులెవరూ తనకోసం రావద్దని స్పష్టం చేశారు.

ఈ మేరకు లారెన్స్ ఓ ట్వీట్ చేశారు. ''హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్..! నాతో పిక్ తీసుకునేందుకు వస్తూ నా వీరాభిమాని శేఖర్ చనిపోయాడని మీకందరికీ తెలుసు. అతని అంత్యక్రియలకు నేను వెళ్లాను. నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఇన్సిడెంట్‌తో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నాతో ఫోటోలు దిగేందుకు మీరెవ్వరూ రావద్దు.

నేనే నా అభిమానులు ఉండే ప్రాంతాలకు వచ్చి వారితో ఫోటోలు దిగుతాను. ఇప్పటి నుంచి నాకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా ప్రతి ఒక్క ఏరియాకు వచ్చి ఫోటోలు దిగుతాను. మొదటగా నేను దీన్ని 7వ తేదీన సేలం నుంచి ప్రారంభిస్తున్నాను. నేను మీకోసం వస్తున్నా..

శేఖర్ ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నాను.'' అని లారెన్స్ ట్వీట్ చేశారు. ఇప్పటికే గుండె సంబంధ బాధిత పిల్లలను ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకుంటున్న లారెన్స్ ఈ నిర్ణయంతో అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com