హాలీవుడ్ హీరో ఎఫ్‌బీ పేజీలో టాలీవుడ్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం
- February 04, 2018
హైదరాబాద్ : సోషల్ మీడియా వేదికగా సినీ నటుల అభిమానుల మధ్య వాగ్వాదం జరగడం సహజమే. కానీ ఇందుకు హాలీవుడ్ హీరో ఎఫ్‌బీ పేజీ వేదిక కావడమే ఇక్కడ విచిత్రం. తాజాగా హాలీవుడ్ హీరో అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఓ ఫొటోను తన ఎఫ్‌బీ అకౌంట్‌లో షేర్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌కు టాలీవుడ్ హీరో మహేశ్ బాబు అభిమాని ఒకరు టామ్ క్రూజ్ కన్నా మహేశ్ బాబు అందగాడని, ఏ విషయంలోనైనా ఎక్కువేనని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌పై ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం స్పందించడంతో రచ్చ మొదలైంది.
మహేశ్ బాబు డ్యాన్స్‌పై వారు కామెంట్ చేయగా ఆయన అభిమానులు ఘాటుగా స్పందించారు. డ్యాన్స్ గురించి మాట్లాడటం కాదు కానీ మహేశ్ బాబు కేవలం 23 సినిమాలు చేసి 8 నంది అవార్డులు, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 21 టీఎస్‌ఆర్, 23 సంజయ్ దత్త్ అవార్డులు గెలుచుకున్నాడని బదులిస్తున్నారు. దీంతో ఈ వాగ్వాదం సోషల్ మీడియా వేదికగా తారా స్థాయికి చేరింది. ఇప్పుడి ఈ పోస్ట్ నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు