ప్రవాసీయుల వెళ్లిపోవడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
- February 04, 2018
కువైట్: కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన తీరున.. కువైట్ నుంచి ప్రవాసీయులను వారి దేశాలకు ఏదో ఒక కారణంతో పంపించడంతో ఆ నిష్క్రమణ ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై తీవ్రంగా చూపుతుందని కువైట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యదర్శి ఖ్ఐస్ అల్-గనేమ్ నిర్ధారించారు. గత ఏడాది ఈ సంక్షోభం గురించి కువైట్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ హెచ్చరించిందని సూచించారు. జూన్ 2018 నాటికి విదేశీయుల నిష్క్రమణ మరింత అధికమవడంతో ఇబ్బందులు ఎదుర్కోవల్సిఉందన్నారు. ప్రవాసీయులలో అత్యధికులు తమ దేశాలకు వెళ్లడం కన్నా ఇతర గమ్యస్థానాలలో మంచి అవకాశాలను వెతుకుతున్నారని ఆయన అన్నారు. వలసదారులపై ఇటీవలి విధించిన ఒత్తిళ్లు ఫలితంగా పెట్టుబడి నివాస రంగంలో ముఖ్యంగా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రవాసులు వారి కుటుంబాలను తమ తమ స్వంత దేశాలకు తిరిగి పంపించి, వారి నివాసాన్ని చెల్లుబాటు అయ్యేలా చేసుకొని బ్రహ్మచారులుగా కువైట్ లో ఉండటానికి సిద్ధపడుతున్నారు. క్రమేపి మారుతున్న ఈ ధోరణి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం యొక్క ప్రస్తుత పరిస్థితిని ఇంకా మరింత దిగజారుస్తుంది. ప్రభుత్వం ప్రవాసీయులకు సంబంధించిన నిర్ణయాలు ప్రకటించిన తర్వాత ప్రవాసీయులు పెద్ద ఎత్తున కువైట్ ను విడిచి వేరే ప్రాంతాలకు తరలివెళ్లిపోవడంతో ఇంటి అద్దెలు సైతం పెద్ద ఎత్తున తగ్గిపోయాయని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







