యాక్టర్ సుదీర్ బాబు :వాడు ఎక్కడ వున్నాడో చెప్పండి
- February 04, 2018
వాడిని నేను ఇంతకన్నా దారుణంగా చావగొడతానంటూ తీవ్ర అగహాన్ని వ్యక్తం చేశారు హీరో సుదీర్ బాబు. 5 నెలల క్రితం ఎనిమిదేళ్ల కొడుకు అబద్ధం చెప్పాడని కారణంతో బాలుడిని తీవ్రంగా కొట్టాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. అది కాస్త సోషల్ మీడియాలో రావడంతో అతనిపై నెటిజెన్ లు బాగానే రియాక్ట్ అయ్యారు.అతను మనిషి కాదు మానవ మృగం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వీడియో హీరో సుదీర్ బాబు కంటపడింది. అది చూసిన సుదీర్ బాబు అతనిపై తీవ్రంగా మండిపడుతూ.. "ప్లీజ్ అతడు ఎక్కడ ఉంటాడో కనిపెట్టండి. వాడిని నేను ఇంతకన్నా దారుణంగా చావగొడతా. అతడిని తండ్రి అనాలంటే సిగ్గుగా ఉంది" అంటూ ఫేస్బుక్ లో వీడియో ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఐదు నెలల కిందట జరిగిన ఈ ఘటన మొబైల్ రిపేర్ సెంటర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే కొడుకుని చితకబాదుతున్న తండ్రి, ఆ సంఘటనను వీడియో తీసింది సాక్షాత్తు బాలుడి తల్లే కావడం గమనార్హం
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







