ఇకపై యు.ఎ.ఈ.అంతటా 'స్మార్ట్ వై-ఫై బిన్' లు

- November 24, 2015 , by Maagulf
ఇకపై యు.ఎ.ఈ.అంతటా 'స్మార్ట్ వై-ఫై బిన్' లు

 

ప్రభుత్వ,ప్రైవేటు మరియు ప్రజల నుండి వినూత్న ఆలోచనలను ఆహ్వానించడానికి యు.ఎ.ఈ. లో జరుగుతున్న సృజనాత్మక వారోత్సవాలలో భాగంగా షార్జా లోని పర్యావరణ మరియు వ్యర్ధ పదార్ధాల నిర్వహణ సంస్థ బీ'యా సౌర శక్తితో, హాట్ స్పాట్ లుగా పనిచేసే 'స్మార్ట్ వై-ఫై బిన్' లను షార్జా అంతటా ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ యొక్క వ్యర్ధ సేకరణ విభాగం - తన్దీఫ్ , 2000 మంది ఉద్యోగులను, 500 వాహనాల శ్రేణిని కలిగిఉంది.   సంస్థ చైర్మన్ - సలీం అల్ ఒవైసీ మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వై-ఫై బిన్ అనేది నైపుణ్యాన్ని, ఉపయోగితను కలగలిపిన, పర్యావరణహిత ఆలోచన అని, మధ్య ప్రాచ్యంలో పర్యావరణహిత దేశంగా ఎదుగుతున్న ఎమిరేట్స్ లో షార్జా ఒక నమూనా అని ఆయన అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com