బహ్రైన్ లో వర్షపాతం - ప్రభుత్వ శాఖల భద్రతా సూచనలు
- November 24, 2015
దేశంలో కొనసాగుతున్న వర్షాలు మరియు అస్థవ్యస్థ వాతావరణ పరిస్థితులలో, ప్రజల భద్రతను పటిష్టం చేసే చర్యలలో భాగంగా ప్రజలకు భద్రతా సూచనలను జారీ చేసారు. ది జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారు - భారీ వర్షాలు కురుస్తున్నపుడు అవసరమైన వస్తువులతో సహా మొదటి అంతస్తులోకి చేరుకొని, కరెంటు కరెక్షన్ ను తొలగించాలి. తడిగా ఉన్న సాధనాలను మరియు వేలాడుతున్న కరెంటు తీగలను ముట్టుకోరాదు. వాహనాలను నడిపేవారు, లోతున ఉన్న మరియు నీరుచేరే అవకాశమున్న ప్రాంతాలలో ప్రయనించరాదు. లోతు తెలియనిదే, నీరు చేరిన ప్రదేశాల గుండా, సరయిన వెలుతురు లేని ప్రదేశాల గుండా రాత్రి పూట ప్రయానించరాదు. ముఖ్యంగా ఇంకా వాహనాల మధ్య కనిష్ట దూరాన్నిఇంకాస్త అధిక పాటించడం వలన అకస్మాత్తుగా ఆగినపుడు జరిగే ప్రమాదాలను నివారించవచ్చు. ఇంకా శాఖ అధికారులు తమ వాహనాల టైర్లను, ముందుగల వైపర్లను సరయిన కండిషన్ లో ఉన్నదీ లేనిదీ సరిచూసుకోవలసిందిగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







