బహ్రైన్ లో వర్షపాతం - ప్రభుత్వ శాఖల భద్రతా సూచనలు

- November 24, 2015 , by Maagulf
బహ్రైన్ లో వర్షపాతం - ప్రభుత్వ శాఖల  భద్రతా సూచనలు

 

దేశంలో కొనసాగుతున్న వర్షాలు మరియు అస్థవ్యస్థ వాతావరణ పరిస్థితులలో, ప్రజల భద్రతను పటిష్టం చేసే చర్యలలో భాగంగా ప్రజలకు భద్రతా సూచనలను జారీ చేసారు. ది జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారు - భారీ వర్షాలు కురుస్తున్నపుడు అవసరమైన వస్తువులతో సహా మొదటి అంతస్తులోకి చేరుకొని, కరెంటు కరెక్షన్  ను తొలగించాలి. తడిగా ఉన్న సాధనాలను మరియు వేలాడుతున్న కరెంటు తీగలను  ముట్టుకోరాదు. వాహనాలను నడిపేవారు, లోతున ఉన్న మరియు నీరుచేరే అవకాశమున్న ప్రాంతాలలో ప్రయనించరాదు. లోతు తెలియనిదే, నీరు చేరిన ప్రదేశాల గుండా, సరయిన వెలుతురు లేని ప్రదేశాల గుండా రాత్రి పూట ప్రయానించరాదు. ముఖ్యంగా ఇంకా వాహనాల మధ్య కనిష్ట దూరాన్నిఇంకాస్త అధిక పాటించడం వలన అకస్మాత్తుగా ఆగినపుడు జరిగే ప్రమాదాలను నివారించవచ్చు. ఇంకా శాఖ అధికారులు తమ వాహనాల టైర్లను, ముందుగల వైపర్లను సరయిన కండిషన్ లో ఉన్నదీ  లేనిదీ సరిచూసుకోవలసిందిగా హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com