నిరుద్యోగులను నిండా ముంచిన ఏఎస్‌ఆర్ కన్సల్టెన్సీ

- February 06, 2018 , by Maagulf
నిరుద్యోగులను నిండా ముంచిన  ఏఎస్‌ఆర్ కన్సల్టెన్సీ

హైదరాబాద్: ఓ కన్సల్టెన్సీ సంస్థ నిరుద్యోగులను నిండా ముంచింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చైతన్యపురి చౌరస్తాలో గల ఏఎస్‌ఆర్ ప్రైవేటు కన్సల్టెంట్ సంస్థ చర్యతో మోసపోయిన నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దుబాయ్-మరీనా మాల్‌లలో అదేవిధంగా దేశంలో వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉచిత వీసా, ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో భాగంగా మెడికల్ టెస్ట్ పేరుతో రూ. 3 వేలను నిర్వాహకులు అభ్యర్థుల నుంచి వసూలు చేశారు. కాలయాపన చేస్తుండటంతో తాము మోసపోయినట్లుగా గుర్తించిన నిరుద్యోగులు పెద్దఎత్తున చేరుకుని నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కన్సల్టెన్సీ నిర్వహాకుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన విషయంపై బాధితులు ఫిర్యాదు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com