'ఓటరు' మూవీ మార్పు కోసమే అంటున్న మంచు విష్ణు.

- February 06, 2018 , by Maagulf
'ఓటరు' మూవీ మార్పు కోసమే అంటున్న మంచు విష్ణు.

యంగ్ హీరో మంచు విష్ణు ఇప్పటికే రెండు మూవీలను పూర్తి చేశాడు.. అందులో ఒకటి గాయత్రి ఈ నెల 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక అచారి ఆమెరికా యాత్ర మూవీని మార్చిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.. ఈ మూవీల తర్వాత విష్ణు చేస్తున్న మూవీ ఓటరు.. ఈ మూవీకి గజ్జెల కార్తీక్ రెడ్డి దర్శకుడు.ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.. ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.. ఈ మూవీ గురించి విష్ణు మాట్లాడుతూ, సోషల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం 'ఓటు వేసేవాడు యజమాని, ఆ ఓట్లతో గెలిచినవాడు సేవకుడు' అనే సందేశాన్ని చెబుతుందని, అది చూసి కొంతమందైనా మారతారనేది తన నమ్మకమని అన్నాడు.. ఈ మూవీలో సురభి హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com