అబుధాబిలో 44 వాహనాల ఢీ: 22 మందికి గాయాలు
- February 06, 2018
అబుధాబి:అబుదాబీలోని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ స్ట్రీట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 44 వాహనాలు ధ్వంసం కాగా, 22 మంది గాయాలపాలయ్యారు. అబుదాబీ పోలీసులు ఈ ఘటన గురించి వివరిస్తూ, ఉదయం 8 గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పారు. తక్కు విజిబిలిటీ కారణంగా రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఒకదాని తర్వాత ఇంకో వాహనం వరుసగా ఒకదాన్నొకటి వెనుకనుంచి ఢీకొనడంతో మొత్తం 44 వాహనాలు ధ్వంసమయ్యాయి. తక్కువ విజిబిలిటీ వున్న సమయంలో వాహనదారులు తమ వాహనాల్ని నెమ్మదిగా నడపాలనీ, వీలైనంతవరకు తక్కువ విజిబిలిటీ వున్నప్పుడు ప్రయాణం చేయడం తగ్గించాలని అబుదాబీ పోలీసులు సూచించారు. విజిబిలిటీ లేకున్నా అతి వేగంతో వెళ్ళే వాహనాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని పోలీసు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!