దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫిల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- February 06, 2018
దుబాయ్:భారతదేశంలోని బెంగళూరుకి చెందిన టామ్స్ అరాకల్ మణి అనే అదృష్టవంతుడు దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం డ్రాలో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. 263 సిరీస్‌లో 2190 నెంబర్ టిక్కెట్‌ని ఆయన కొనుగోలు చేశారు. దుబయాన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కాంకోర్స్ డి వద్ద తీసిన డ్రాలో విజేతను ఎంపిక చేశారు. 38 ఏళ్ళ మణి, ఇంటర్నేషనల్ కార్డ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఓ రిటెయలర్ వద్ద 34వ యానివర్సరీ సందర్భంగా డిసెంబర్‌లో ఈ టిక్కెట్‌ని ఆయన కొనుగోలు చేశారు. 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని ఆయన అన్నారు. 1999లో మొదలైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం ప్రమోషన్‌లో ఇప్పటిదాకా 124 మంది భారతీయులు 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇదిలా వుంటే 33 ఏళ్ళ లతా బరద్వాజ్ బిఎండబ్ల్యు 750 ఎల్‌ఐఎక్స్ డ్రైవ్ ఎం స్పోర్ట్ కారుని గెల్చుకున్నారు. ఆమె దుబాయ్ డ్యూటీ ఫ్రీ మాజీ ఉద్యోగి. ఒకప్పటి సన్నిహితుల్ని కలుసుకోవడం, కారుని గెల్చుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!