సౌదీలో మెదక్ జిల్లా వాసి సూసైడ్
- February 06, 2018
నిజాంపేట(మెదక్ జిల్లా), ఫిబ్రవరి 6: పొట్టకూటి కోసం వలసెళ్లిన ఓ వ్యక్తి సౌదీలో ఉరేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నిజాంపేటకు చెందిన జాల మల్లేశం (37) అప్పు చేసి మరీ రెండేళ్ల కిందట సౌదీకి వెళ్లాడు. సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో మల్లేశం మాట్లాడాడు. అయితే అదే రోజు రాత్రి తాను ఉంటున్న గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. మృతి గల కారణాలు తెలియలేదు. మృతుడి కి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
తన భర్త మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేలా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని లక్ష్మి వేడుకుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







