దుబాయ్ లో రూ.87లక్షలు జరిమానా భారతీయుడికి

- February 06, 2018 , by Maagulf
దుబాయ్ లో రూ.87లక్షలు జరిమానా భారతీయుడికి

దుబాయ్‌: యూఏఈ రవాణా విభాగాన్ని విమర్శిస్తూ ఇ-మెయిల్‌ పెట్టినందుకు.. 25 ఏళ్ల భారత కార్మికుడిపై దాదాపు రూ.87 లక్షల భారీ జరిమానాను ఆ దేశం విధించింది. కొద్ది నెలల క్రితం డ్రైవింగ్‌ లైసెన్స్‌ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన ఆ కార్మికుడు.. రవాణా విభాగానికి విమర్శిస్తూ ఇ-మెయిల్‌ చేశారు. ఉద్దేశపూర్వకంగానే పేదలను అర్హత పరీక్షలో ఫెయిల్‌ చేసి, వారు మళ్లీ మళ్లీ పరీక్షలకు హాజరయ్యేలా రవాణా విభాగం చేస్తోందని విమర్శించారు. అలా పేదల నుంచి డబ్బు దోచుకుంటోందని ఆరోపించారు. దీంతో తమను అవమానించేలా, చులకనచేసేలా సదరు మెయిల్‌ ఉందని పేర్కొంటూ.. రవాణా విభాగం పోలీసుశాఖకు ఫిర్యాదు చేసింది. నిందితుడు నేరం అంగీకరించనప్పటికీ.. దుబాయ్‌ కోర్టు తీర్పుతో ఆయన్ను మూడు నెలలపాటు జైల్లో పెట్టారు. ఇటు ప్రభుత్వాన్ని చులకన చేసినందుకు, అవమానించినందుకు కోర్టు రూ.87లక్షలు జరిమానా విధించింది.

శిక్ష పూర్తయ్యాక నిందితుడిని దేశం నుంచి పంపించేయాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com