విధి నిర్వహణలో హత్యకు గురైన 'కాప్'కి మెడల్ ఆఫ్ హానర్
- February 07, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ అధికారి సౌద్ బిన్ సయీద్ బిన్ సౌద్ అల్ రవాహికి మెడల్ ఆఫ్ హానర్‌ని ప్రకటించారు. సిటీ సెంటర్ మస్కట్ మాల్ వద్ద గత డిసెంబర్లో సౌద్ బిన్ సయీద్ హత్యకు గురయ్యారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అండ్ కస్టమ్స్ లెఫ్టినెంట్ జనరల్ హస్సన్ బిన్ మొహ్సెన్ అల్ షోరైకి - సౌద్ బిన్ సయీద్ బిన్ సౌద్ అల్ రవాహికి మెడల్ ఆఫ్ బ్రేవరీ అవార్డ్‌ని ప్రకటించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మృతుడి తండ్రికి ఈ మెడల్ని అందజేశారు. ఇండియన్ సిటిజన్ ఒకర్ని చంపే క్రమంలో ఒమన్ జాతీయుడొకరు అల్ రవాహిని కత్తితో పొడిచాడు. ఈ క్రమంలో అల్ రవాహి తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో నిందితుడు మెంటల్ ఇల్‌నెస్‌తో బాధపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







