భర్త అపరిశుభ్రత: విడాకులు కోరిన భార్య

- February 07, 2018 , by Maagulf
భర్త అపరిశుభ్రత: విడాకులు కోరిన భార్య

యు.ఏ.ఈ:వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమన్న విషయాన్ని తెలియజేస్తూ ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా వ్యక్తిగత పరిశుభ్రత పాటించని ఓ భర్త నుంచి తనకు విడాకులు కావాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఓ మహిళ. తన భర్త తన మీదే పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నాడనీ, అతన్ని పరిశుభ్రంగా వుండమని మాత్రమే తాను కోరుతున్నప్పటికీ అతనుపట్టించుకోవడంలేదని ఆ మహిళ ఆరోపించింది. లీగల్‌ అడ్వయిజర్‌ మొహమ్మద్‌ సుహాద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ, తమ భర్తల నుంచి విడిపోయి, మంచి జీవితం కోసం ప్రయత్నించాలనుకుంటున్నారనీ, ఇలాంటి కేసులు ఇటీవల పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి కేసుల విషయంలో ముందుగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తారు. వాస్తవానికి కుటుంబ సభ్యులే ఈ పని ముందుగా చేయాల్సి ఉంటుంది. బంధువుల కౌన్సిలింగ్‌కిగానీ, పోలీసులు - న్యాయ సలహాదారుల కౌన్సిలింగ్‌కిగానీ కలతలు తగ్గని పక్షంలో విడాకుల అంశం ముందుకు సాగే అవకాశం ఉంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com