అబుదాబి లో 'యోగా గురు': స్పెషల్ స్టోరీ

- February 09, 2018 , by Maagulf

అబుదాబి:ఆయన పేరు జుజ్జవరపు వెంకట సుబ్రహ్మణ్యం , వయస్సు 86 , తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామ వాస్తవ్యులైన సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం అబూదాబి కి ఆయన కుమార్తె  ఇంటికి విసిట్ వీసా మీద వచ్చ్చారు. 

ఆయన నడక ,చురుకు దనం,  చూసిన అందరూ ఆశ్చర్యం తో నిజంగా ఆయన 86 ఏళ్ళ వ్యక్తి అంటే నమ్మలేము అంటున్నారు.. 

ఇంతకీ ఆయన ఆరోగ్య రహస్యం ఏమని అడిగితే ఆయన చెప్పేది ఒక్కటే . క్రమ బద్ధమైన జీవనం అని అంటారు. 
వృత్తి రీత్యా వ్యవసాయ దారులైన సుబ్రహ్మణ్యం గారు తెల్లవారు ఝామున 3.30 కి నిద్దుర లేసి సుమారు 30 నిమిషాలు  ప్రాణాయామం  చేసుకుని తదుపరి ఒక గంట సేపు యోగాసనాలు వేసుకున్న తరువాతే గాని ఆయన దిన చర్య ప్రారంభం కాదు . ఆత్రేయపురం లో ఉన్న మహాత్మా గాంధి విద్యా సంస్థల బోర్డు మెంబరుగా కూడా ఆయన సమాజానికి సేవను అందిస్తున్నారు.  గోదావరి నది వడ్డున ఉన్న వారి గ్రామం లో చక్కని పైర గాలి వాతావరణంలో ఉండే ఆయన అబూ దాబి నగరంలో సెంట్రల్ ఏసీ ఇళ్లలో కొంచెం ఇబ్బంది పడినా నగరంలోని  కోర్నిష్ లో చక్కగా సేద తీర్చుకున్నారు.

అబూ దాబి వచ్చాక వ్యవసాయ పనులు లేక పోయిన అదే షెడ్యూల్ ప్రకారం తెల్లవారు ఝామున 3.30 కి నిద్దుర లేసి ప్రాణాయామం , యోగా తరువాత  ఉదయం 6. 30 కి ఆయన ఉదయం అల్పాహారం తీసుకుని, మధ్యాన్న భోజనం 11 గంటలకి ముగించుకుని , మళ్ళీ సాయంత్ర భోజనం 6.30 ముగించుకుంటారు . 

1968 వ సంవత్సరంలో ఒక సారి ఎడమ ప్రక్క భుజంలో కొద్దిగా నొప్పి వచ్చిందని గుండె పోటు అనే అనుమానం తో  భీమవరం లోని వేగిరాజు రామకృష్ణం రాజు ప్రకృతి వైద్య శాల లో పరీక్షించు కోవడానికి వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు చేసి కేవలం గ్యాస్ నొప్పి అని చెప్పి ప్రకృతి వైద్య విధానంతో చికిత్స చేశారు . 

అప్పటి నుండి క్రమం  తప్పకుండ యోగాసనాలే కాక ఆహార నియమం కూడా చాలా క్రమశిక్షణ తో పాటిస్తూ వస్తున్నారు . భోజనం తరువాత తప్పని సరిగా వజ్రాసనం వేస్తారు . దీనివల్ల జీర్ణాశయం చక్కగా పని చేస్తుంది అని ఆయన చెప్తారు. 

ఆయన అందరికి ఇచ్ఛే సలహా ఒక్కటే ,  ఆహారానియమావళి లో గాని, నిద్ర విషయం లో గాని  క్రమశిక్షణ చాలా ముఖ్యం అని  చెప్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com