ఏపీ ఎంపీల నిరసన గళం.. మార్చి 5కు లోక్‌సభ వాయిదా

- February 09, 2018 , by Maagulf
ఏపీ ఎంపీల నిరసన గళం.. మార్చి 5కు లోక్‌సభ వాయిదా

టీడీపీ ఎంపీల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. ఐదో రోజు ఏపీ ఎంపీలు ఇంకాస్త స్వరం పెంచారు.. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఎన్నిసార్లు సర్ది చెప్పాలని చూసినా.. ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు.. ఏపీకి పూర్తి న్యాయం చేయాలంటూ నినాదాలతో మారుమోగించారు. దీంతో లోక్‌సభను మార్చి 5కు వాయిదా వేశారు స్పీకర్‌ సుమిత్రా మహాజన్..

లోక్‌సభ ప్రారంభమైన దగ్గర నుంచి ఎంపీలు ఆందోళన బాట పట్టారు. విభజన హామీలు అమలు చేయాలంటూ లోక్‌సభను స్తంభింపజేశారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. సభ మొదలవగానే ఎంపీలు సభలో నిరసన వ్యక్తం చేశారు. అయితే సభ మొదలైన 5 నిమిషాల తర్వాత ఎంపీ శివప్రసాద్ లోనికి ప్రవేశించారు. అతని వేషధారణను చూసిన స్పీకర్ సుమిత్రామహాజన్ ఏదో జరగబోతోందని భావించి సభను వాయిదా వేశారు.

తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఏపీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు..  విభజన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవద్దని, సజావుగా జరిగేందుకు సహకరించాలని సభాపతి సుమిత్రా మహాజన్ ఎంత సర్దిచెప్పినప్పటికీ సభ్యులు బెట్టు వీడలేదు.. దీంతో మళ్లీ సభను 12 గంటలకు వాయిదా వేశారు.. తరువాత సభ ప్రారంభమైనా మళ్లీ అదే పరిస్థితి కనిపించింది.. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభాపతి సభను మార్చి ఐదో తేదీకి వాయిదా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com