పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే తేనె...
- November 25, 2015
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, ఆహారపు అలవాటు, ఒత్తిడి, లైఫ్ స్టైల్ వల్ల శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఒత్తిడి, పోషకాహరం లోపం లేదా జంక్ ఫుడ్స్ వల్ల అధిక బరువు గురి అవుతున్నారు. దాంతో బరువు తగ్గించుకోవాలని ఆలోచనలో పడ్డ సందర్బాలు లేకపోలేదు. బరువు తగ్గించుకోవాలనుకొనేవారికి ఒక ఆరోగ్యకరమైన మార్గం రెగ్యులర్ డైట్ లో తేనె ఒక సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బరువు తగ్గించే విషయంలో తేనె చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. తేనె ఒక నేచురల్ స్వీట్నర్ కాబట్టి, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బరువు తగ్గించడంలో నేచురల్ స్వీట్స్ కలిగిన తేనె కంటే మరొ పదార్థం మరొకటేముంటుంది చెప్పండి... తేనె చూడటానికి కూడా కలర్ ఫుల్ గా, మంచి సువాసనతో నోరూరిస్తుంటుంది. కాబట్టి, తేనెను ఇష్టపడే వారు, జస్ట్ సలాడ్స్, టీ, ఫ్రూట్స్ లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. పొట్ట కొవ్వును గణనీయంగా తగ్గించే ఉత్తమ ఆహారాలివి..! ఒక కప్పు గ్రీన్ టీకి ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చడం వల్ల బరువు తగ్గించడంతో పాటు మరిన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి, శరీరంలో అదనపు పౌండ్ల బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, ఈ సింప్లెస్ట్, ఫాస్టెస్ట్ పద్దతులను ఫాలో అయిపోండి. ఈరోజు రాత్రి మీరు డిన్నర్ లో హానీ సాడ్విచ్ తయారుచేసుకోండి . ఫ్రెష్ గా ఉండే 2 బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక వైపు మాత్రమే తేనె రాసి, మరో బ్రెడ్ పీస్ ను దానికి మీద ఉంచి రుచిని ఆస్వాదిస్తూ తినడమే తరువాయి....ఇది ఒక లోక్యాలరీ మరియు ఎనర్జిటిక్ డిన్నర్ ఫుడ్. ఇలా రాత్రుల్లో లైట్ డిన్నర్ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గించుకోవచ్చు. చాలా సింపుల్ గా మరియు త్వరగా బరువు తగ్గాలనుకొనే వారు ఇంట్లోని వంటకు నూనెకు ప్రత్యామ్నాయంగా తేనెను జోడించండి. ఫ్రైడ్ ఫుడ్స్ కు మరియు గ్రిల్లింగ్ ఫుడ్స్ కు నూనెకు బదులు తేనె అప్లై చేసి వండుకోవడం వల్ల క్యాలరీలు తక్కువ, బరువు తగ్గించడంలో ప్రభావం ఎక్కువ. ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల చాలా వేగంగా బరువు తగ్గించుకోవచ్చు. బాగా కాచి, మీగడ తీసిన పాలలో క్యాలరీలు ఉండవు. ఇక తేనె ఎనర్జీని అందిస్తుంది. కాబట్టే చాలా మంది జిమ్ నిపుణులు వర్కౌట్స్ కు ముందు ప్రోటీన్ ఫుడ్స్ ను తీసుకోమని సలహాలిస్తుంటారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి, రెండు చెంచాల నిమ్మరం జోడించి కాలి పొట్టతో తీసుకోవడం వల్ల చాలా వేగంగా...ఎఫెక్టివ్ గా బరువు తగ్గుతారు. బరువు తగ్గించుకోవాలనుకొనే వారు, డైట్ ప్లాన్ లో ఓట్స్ తీసుకొనే వారు ఓట్స్ కి పంచదార కంటే తేనె మిక్స్ చేసి తీసుకోవడం ఒక ఉత్తమ మార్గం. ఎఫెక్టివ్ మార్గం. చాలా మంది టీలో కూడా నిమ్మరసం, తేనె మిక్స్ చేసి తీసుకుంటున్నారు . ఈ హెల్తీ పానీయాన్ని రోజులో రెండు సార్లు తీసుకోవడం వల్ల బరువు తగ్గించి ఎనర్జీ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఒక బౌల్ వెజిటేబుల్, ఫ్రూట్ సలాడ్స్ లో దాల్చిన చెక్క పౌడర్ మరియు ఒక చెంచా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి . ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!







