భాగ్యనగరంలో 'సోఫియా'
- February 10, 2018
హైదరాబాద్: మానవరూప రోబో సోఫియా భారత్‌కు రెండోసారి రాబోతున్నది. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్‌లో జరగనున్న వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(డబ్ల్యూసీఐటీ)కి సోఫియా రానున్న ది. ఈ నెల 19నుంచి 21వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి పుల్లెల గోపీచంద్, జగ్గీ వాసుదేవ్, పీడబ్ల్యూసీ ఇండియా చైర్మెన్ శ్యామల్ ముఖర్జీ, అడాబ్ సిస్టమ్ సీఈవో శాంతాను నారాయణ్ హాజరుకానున్నారు. దాదాపు 150మంది అంతర్జా తీయ నాయకులు ఇందులో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోఫియా హాజరై ప్రసంగించనున్నదని డబ్ల్యూసీఐటీ హైదరాబాద్ అంబాసి డర్ సుమన్ రెడ్డి తెలిపారు. ఈ రోబో సృష్టికర్తలూ హాజరు కానున్నారని వెల్లడించారు. సౌదీ అరేబియా పౌరసత్వాన్ని పొందిన ఈ రోబోను హాంగ్‌కాంగ్‌లోని హాన్సన్ రోబోటిక్స్ రూపొందించింది. కెమెరాలు, మైక్రోఫోన్లను అమర్చిన ఈ రోబో కండ్లతో గుర్తించి మాట్లాడగలిగే కృత్రిమ మేధా(ఏఐ) సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. సంతోషాన్ని వ్యక్తపరిచే భావోద్వేగాన్ని మాత్రమే సోఫియా కలిగి ఉన్నది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







