పెళ్లికోసం కల్యాణ మండపాన్ని బుక్ చేసుకున్న విశాల్!
- February 10, 2018
తెలుగులో పుట్టి తమిళ సినీ పరిశ్రమలో రాణిస్తున్న పందెంకోడి విశాల్ రెడ్డి, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించాడు. అయితే పెళ్లి త్వరలో అంటే రెండు మూడు నెలలు , వారాలు కాదు ఏకంగా జనవరిలో. అంటే ఇంకా ఇంచుమించు సంవత్సర కాలం ఉంది. విశాల్ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్బంగా తన పెళ్లిపై స్పందించారు. నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోందని, డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని, జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపాడు. సంఘం సొంత భవనంలో జరగనున్నమొదటి వివాహం తనదే అవుతుందని, అందుకే మండపాన్ని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నానని అన్నారు. కానీ పెళ్లి కూతురు ఎవరనేది మాత్రం విశాల్ చెప్పకపోవడం గమనార్హం. ఇదిలావుంటే గతంలో నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి, విశాల్ పై మనసుపారేసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!







