కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- November 25, 2015
దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో స్థిరంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి మరో 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మంగళవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం మరింత బలపడింది. ఇది అల్పపీడనంగా మారాక శుక్రవారం నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. శనివారం నుంచి ప్రత్యేకించి దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. రాయలసీమ, కోస్తాలోని ఇతర జిల్లాలపైనా ఈ ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కోస్తాలో గురువారం అక్కడక్కడా వానలు, ఒకటి, రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







