వీటితో మీ ఊపిరితిత్తులు సేఫ్....
February 10, 2018
ధూమపానం చేసేవారు ప్రతిరోజు మూడు టమోటాలు, మూడు యాపిల్స్ తింటే ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చునని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అంతకుముందే పాడైన ఊపిరితిత్తులను వీటి ద్వారా నయం చేసుకోవచ్చట. మామూలుగా ధూమపానం ప్రియుల ఊపిరితిత్తులు కొంతకాలానికి పనిచేయడం మానేస్తాయట. 900మంది మీద సుధీర్ఘకాలం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఒక నిర్ధారణకు వచ్చారు.