నితిన్ మూవీ ఛల్ మోహన్రంగ..
- February 12, 2018
నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'ఛల్ మోహన్‌రంగ' అనే టైటిల్‌ను నిర్ణయించారు. శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై నిఖితా రెడ్డి సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ కథ అందించిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఆదివారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. దీనిపై హీరో నితిన్ స్పందిస్తూ, 'పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్ర ప్రచార చిత్రాలను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉంది' అని ట్వీట్‌తో పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు హైదరాబాద్, ఊటీ, అమెరికాలో షూటింగ్ చేశాం. మిగిలిన ఒక్క పాటను ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. అలాగే చిత్ర టీజర్‌ను ప్రేమికుల రోజైన ఈ నెల 14న, సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 'షూటింగ్‌తోపాటు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రం. చాలా సరదాగా సాగుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది' అని దర్శకుడు తెలిపారు. డా.కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజరు స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, పమ్మి సాయి, రాజశ్రీనాయర్, ఆశురెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బేబి హాసిని, బేబి కృత్తిక, మాస్టర్ జోరు, మాస్టర్ లిఖిత్, మాస్టర్ స్నేహిత్, మాస్టర్ స్కందన ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: ఎం.నటరాజ సుబ్రమణియన్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







