'భలే మంచి రోజు' ఆడియో ఆవిష్కరించిన మహేష్‌

- November 25, 2015 , by Maagulf
'భలే మంచి రోజు' ఆడియో ఆవిష్కరించిన మహేష్‌

మహేష్‌ ఆవిష్కరించిన 'భలే మంచి రోజు' ఆడియో సుధీర్‌బాబు, వామిక, ధన్య బాలకృష్ణ జంటగా రూపొందుతున్న 'భలే మంచి రోజు' ఆడియోను ప్రిన్స్‌ మహేష్‌బాబు విడుదల చేశారు. సన్నీ స్వరాలు సమకూర్చిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం రాత్రి శిల్పకళా వేదికలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా మహేష్‌బాబు హాజరయ్యారు. ఆడియో ఆవిష్కరించి తొలి సీడీని రానాకు అందించారు. విజయ్‌, శశి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీరాం ఆదిత్య దర్శకుడు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాల కృష్ణ, దిల్‌రాజు, రెజీనా, సందీప్‌ కిషన్‌, లగడపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com